తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ ప్రక్షాళనపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు మరోసారి ప్రధానంగా వినిపిస్తోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రభావం, పార్టీ కోసం చేసిన రాజకీయ పోరాటం, ప్రజల్లో సంపాదించుకున్న గుర్తింపు కారణంగా ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అధికారంలోకి రావడంలో క్షేత్రస్థాయిలో కష్టపడ్డ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నాయకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటానికి ముఖచిత్రం
రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆయన తనదైన శైలిలో ప్రజా రాజకీయాలను కొనసాగించారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు పొందడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యే నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన నాయకుల్లో రాజగోపాల్ రెడ్డి ఒకరు. అయితే ఆయన పోరాటం వ్యక్తులపై కాకుండా ప్రభుత్వ విధానాలు, అవినీతి వ్యవహారాలు, పాలనా వైఫల్యాలపై కేంద్రీకృతమై.. ప్రజాపక్షాన ఉంటుంది. నాడు బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో కాంగ్రెస్‌కు బలం చేకూర్చడంలో ఆయన వేసిన అడుగులే నేడు కాంగ్రెస్ పార్టీ నల్గొండలో అఖండ విజయం, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నది నిర్వివాదాంశం.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ఎన్నిసార్లు ఎమ్మెల్యే, ఎంపీ అయ్యామన్నది కాదు.. ఎన్ని జీవితాల్లో మార్పు తీసుకువచ్చానన్నదే ముఖ్యమన్నదే తన లక్ష్యమంటారు రాజగోపాల్ రెడ్డి. అటు నియోజకవర్గంలోనూ, ఇటు జిల్లాలోనూ సమస్య ఏదైనా వస్తే.. ముందుండి పరిష్కారం చూపిస్తారు. ఇక పేదలకు అత్యవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి, రైతు సమస్యలపై రాజగోపాల్ రెడ్డి నిత్యం గళం విన్పిస్తున్నారు. పేదల అభివృద్ధి మాత్రమే కాదు.. వారి కష్ట సుఖాల్లో భాగమవడం, నియోజకవర్గంలోనే మాత్రమే కాదు.. తెలంగాణ అంతటా ఆయనకు తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది. పేదలకు నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం అందిస్తే.. వారి జీవితాలను బాగు చేసినట్టేనని ఆయన భావిస్తారు. ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అందుకే తన సొంత పైసలు ఖర్చు చేసి పేదల అభ్యున్నతికి, విద్య, వైద్యం కోసం నిరంతరం పాటుపడుతున్నారు.
క్యాబినెట్‌లో చోటు కల్పించాలన్న సందేశం
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలతోపాటుగా, సీఎం రేవంత్ రెడ్డి సైతం అనేక సార్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల సమయంలో, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి… భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చిన ఊపు వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు స్పష్టం చేస్తున్నారు. పార్టీ, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం ద్వారానే కాంగ్రెస్ పార్టీకి వచ్చే రోజుల్లో గౌరవం దక్కుతుందని నాయకులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటుగా, రాష్ట్రంలోని అసలు సిసలు కాంగ్రెస్ నాయకులంతా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా, ఆయనకు సముచిత గౌరవం కల్పించినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడే కాంగ్రెస్‌కు రాజన్న అత్యవసరం
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు చేరుకుంటున్న సమయంలో ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై సహజంగానే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో బలమైన నాయకులను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విశ్వసనీయత కలిగిన నేతలకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావచ్చని భావిస్తున్నారు. అటు మాస్, ఇటు యూత్ ఫాలోయింగ్ ఉన్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే… రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతోందని, వచ్చే ఎన్నికల్లో ఊపు వస్తోందని, అధికారాన్ని కైవసం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహంలో కీలక పేరు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే బలమైన ప్రాంతీయ నాయకత్వాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందువరుసలో ఉంటారు. పార్టీ విస్తరణ, క్యాడర్ బలోపేతం, ప్రభుత్వానికి రాజకీయ రక్షణ కల్పించడం వంటి అంశాల్లో ఆయన అనుభవం ఉపయోగపడుతుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అందుకే రానున్న క్యాబినెట్ ప్రక్షాళనలో రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పిస్తే అది ఆయనకు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వ్యూహానికి కూడా బలమైన ముందడుగవుతుందని చెబుతున్నారు.
#KomatireddyRajGopalReddy #RajGopalReddy #TelanganaCongress #CongressParty #TelanganaPolitics #CabinetExpansion #CabinetReshuffle #RevanthReddy #NalgondaPolitics #CongressGovernment #TelanganaNews #PoliticalNews #CongressLeader #MinisterPost #PoliticalAnalysis #Nalgonda #TelanganaCabinet #CongressCadre #PeopleLeader #PublicLeader #CongressStrategy #TelanganaCongressParty #PoliticalUpdate #StatePolitics #CongressFuture











