కాకినాడలో మొదలైన ఓ వ్యక్తిగత పరిచయం.. చివరకు ఓ కుటుంబాన్ని గోదావరిలోకి నెట్టిన విషాదంగా మారిందా? ఆగస్టు 16న రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, పదేళ్ల మనవడు గోదావరిలోకి దూకడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో బాలుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత వెలుగులోకి వచ్చిన సౌజన్య సూసైడ్ నోట్ కేసును మరో మలుపు తిప్పింది. మత మార్పిడికి ఒత్తిడి, బెదిరింపులు, భర్త హత్య, ఆస్తుల వ్యవహారం, ఓ గ్యాంగ్ ప్రమేయం అంటూ సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సాధిక్ ఖాన్‌పై కేసు నమోదైంది. మీరట్‌లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బీజేపీ నేత సోము వీర్రాజు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ కోరగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని అణచివేస్తున్నాయని ఆరోపించారు. అయితే ‘లవ్ జిహాద్’ కోణం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. అసలు ఈ కుటుంబాన్ని ఆత్మహత్య వైపు నడిపించిన పరిస్థితులు ఏమిటి? సూసైడ్ నోట్‌లోని ఆరోపణల్లో ఎంత నిజం ఉంది? సాధిక్ వెనుక ఎవరైనా ఉన్నారా? ఆరోపణల నుంచి అరెస్టు వరకు సాగిన ఈ కేసులో నిజం ఎక్కడుంది? ఇప్పుడు తేలాల్సింది అదే.
#Kakinada #KakinadaFamilyTragedy #KakinadaFamilyDeaths #KakinadaCase #NookarajuFamily #Nookaraju #Soujanya #SadiqKhan #LoveJihad #LoveJihadAllegations #SuicideNote #ReligiousConversion #JagadeeswaraReddy #MurderInvestigation #KakinadaPolice #Rajahmundry #Godavari #SomuVeerraju #VijayaSaiReddy #CentralInvestigation #CrimeNews #APNews #AndhraPradesh #AndhraPradeshNews











