జాతీయ పతాకం దేశ గర్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ’హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ ప్రజలకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2022 నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కోట్లాది మంది భాగస్వాములవుతున్నారని గుర్తుచేశారు. ఈసారి కూడా జాతీయ జెండాను ఎగురవేసి వికసిత్ భారత్ నిర్మాణంపై తమ ఉమ్మడి కట్టుబాటును చాటాలని మోదీ కోరారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యసాహసాలను ప్రధాని స్మరించుకున్నారు. 1942 ఆగస్టు 9న మహాత్మాగాంధీ నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి కీలక మలుపుగా నిలిచిందన్నారు. ఇదిలా ఉండగా కేరళలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించబోమని ఆరోగ్యశాఖ మంత్రి కె.మురళీధరన్, కాంగ్రెస్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నిథాన్ తెలిపారు. గతంలో మాదిరిగానే తొలి రెండు చరణాలను మాత్రమే పాడతామని వెల్లడించారు.
#HarGharTiranga #NarendraModi #PMModi #Tricolour #NationalFlag #India #IndependenceDay2026 #HarGharTiranga2026 #ViksitBharat #QuitIndiaMovement #August9 #IndianFlag #Patriotism #IndiaNews #ModiNews











