రైతాంగం, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే ఏలూరి విస్తృత పర్యటన

43

పర్చూరు, జూన్ 22(నాదేశం) : పర్చూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు సోమవారం మార్టూరు, యద్దనపూడి, ఇంకొల్లు మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజలతో నేరుగా మమేకమయ్యారు.
మార్టూరులోని ‘శ్రీ వీరాంజనేయ వెజిటేబుల్ టొబాకో నర్సరీ’ని సందర్శించిన ఎమ్మెల్యే, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక ఆర్యవైశ్య సంఘ నాయకులతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

యద్దనపూడి మండలం గన్నవరంలో శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారుల మెనూ, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. గన్నవరంలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇంకొల్లు మండలం గన్నవరం, గొల్లపాలెం గ్రామాల్లో నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం… ఇంటింటి ప్రచార కార్యక్రమం’ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఏలూరి ఆవిష్కరించారు. ప్రభుత్వ వ్యవసాయ, సంక్షేమ పథకాలను ప్రతి రైతుకూ చేరవేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

 

#EluriSambasivaRao #ParchurMLA #Parchur #Martur #Yaddanapudi #Inkollu #AndhraPradesh #DevelopmentWorks #PublicOutreach #Rachabanda #FarmersWelfare #RythannaMeekosam #Agriculture #Farmers #Anganwadi #VillageDevelopment #GovernmentSchemes #RuralDevelopment #PublicGrievances #APPolitics #LocalNews #NaDesamNews #Gannavaram #Gollapalem #CommunityMeeting