Home AP డీఎస్సీ అవకతవకల ఆరోపణలు – జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

డీఎస్సీ అవకతవకల ఆరోపణలు – జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

40

లోకేశ్‌తో చర్చకు రావాలని డిమాండ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఘాటు సవాల్ విసిరారు. డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విసిరిన సవాల్‌ను స్వీకరించి జగన్ వెంటనే బహిరంగ చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను వాస్తవాలు, ఆధారాలతో సహా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేవలం తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ రాజకీయాలు చేయడానికే డీఎస్సీపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతు సంక్షేమంలో కూటమి మార్క్ భరోసా
వైసీపీ హయాంలో అడ్డగోలుగా పెట్టిన బకాయిలను క్లియర్ చేస్తూ కూటమి ప్రభుత్వం ప్రతి రైతన్నకూ నమ్మకమైన భరోసా ఇస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా వదిలేసిన 81 మంది రైతు కుటుంబాలకు తమ ప్రభుత్వమే 5.67 కోట్ల రూపాయలు చెల్లించి ఆదుకుందన్నారు. ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. జగన్ మార్క్ రైతు ద్రోహం ముగిసిందని, రాష్ట్రంలో కూటమి మార్క్ రైతు రాజ్యం నడుస్తోందని స్పష్టం చేశారు. జూన్ 2024 నుండి రాష్ట్రంలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని, రెండేళ్లలో 148 కేసులు మాత్రమే నమోదయ్యాయని వివరించారు. రొయ్యల ఫీడ్‌ ధరలు వైసీపీ హయాంలో ఎంత మేరకు పెరిగాయనే అంశంపైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.