మెగా డీఎస్సీ 2025 నియామకాలపై వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ నూతన ఉపాధ్యాయులు కర్నూలులో భారీ నిరసన చేపట్టారు. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజు వద్దకు చేరుకుని ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. నియామకాలపై నిరాధార ఆరోపణలు చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కష్టపడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమపై బురదజల్లడం సరికాదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ మెగా డీఎస్సీ కోసం ఎంతో కష్టపడి చదివామని, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందామని తెలిపారు. తమ నియామకాలను దగా డీఎస్సీగా చిత్రీకరించడం బాధాకరమన్నారు. డీఎస్సీ నిర్వహణపై కనీస అవగాహన లేని వారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.
#MegaDSC #MegaDSC2025 #DSCRecruitment #DSCProtest #MegaDSCTeachers #TeachersProtest #Kurnool #KurnoolTeachers #APTeachers #APDSC #TeacherRecruitment #YSRCP #DSCControversy #DSCIrregularities #GovernmentJobs #AndhraPradesh #APPolitics #TeacherJobs











