ప్రతిపక్షాలకి పొంచి ఉన్న గండం.
లోక్‌సభ సీట్ల పెంపునకు వ్యూహం.
బిల్లు పాసైతే దక్షిణాది దాసోహం.
అడ్డుకుని తీరుతామంటున్న కాంగ్రెస్.
డీఎంకే హ్యాండ్ ఇస్తే ప్లాన్ మొత్తం రివర్స్.
543 స్థానాల నుంచి 850కి పెంపు.. పార్లమెంట్లో మళ్లీ సీట్ల సమరం! మహిళా రిజర్వేషన్ల పేరుతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం కసరత్తు చేస్తోందా? జనాభా ప్రాతిపదికన సీట్లు పెరిగితే ఉత్తరాది బలపడుతుందా? దక్షిణాది రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందా? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో రగులుతున్న అసలు ప్రశ్న. ఏప్రిల్‌లో ప్రతిపక్షాల ఐక్యతతో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌ను వేదికగా చేసుకుంటోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న సమావేశాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మూడొంతుల మెజారిటీ సాధించడం మోదీ ప్రభుత్వానికి మరో అగ్నిపరీక్షగా మారనుంది. ఖర్గే ఇప్పటికే పోరాటానికి సిద్ధమయ్యారు. మమత, స్టాలిన్ గతంలో అడ్డుపడ్డారు. ఇప్పుడు దక్షిణాది గొంతుకగా నిలుస్తున్న డీఎంకే ఏం చేయబోతోంది? ఎన్డీఏ మిత్రపక్షాలు కేంద్రానికి అండగా నిలుస్తాయా? 2029 ఎన్నికల ముందే దేశ రాజకీయ పటంలో భారీ మార్పులు రాబోతున్నాయా? మహిళా రిజర్వేషన్ల భవిష్యత్తు ఏమిటి? సంఖ్యల వెనుక దాగిన రాజకీయ వ్యూహాలేమిటి? పార్లమెంట్లో మరోసారి ఆధిపత్య పోరుకు తెరలేవబోతోందా?
#LokSabhaDelimitation #DelimitationDebate #LokSabhaSeats #WomensReservation #SouthIndia #NorthIndia #Congress #DMK #MKStalin #MamataBanerjee #MallikarjunKharge #NarendraModi











