బీజేపీ–అకాలీ కూటమి సంచలనమా?
పంజాబ్‌లో పొత్తుల పంజా.. అధికారం ఎవరిది?
ఆరేళ్ల వైరం.. మళ్లీ ఒక్కటైన మిత్రులు! ఆప్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీ–అకాలీదళ్ కొత్త రాజకీయ చదరంగం మొదలుపెట్టాయి. కానీ ఈ పొత్తు పంజాబ్‌లో అధికారాన్ని అందిస్తుందా? లేక రెండు పార్టీల బలహీనతలను బయటపెడుతుందా? ఒకప్పుడు పంజాబ్ రాజకీయాలను శాసించిన అకాలీదళ్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. 2012లో 58 స్థానాలు గెలిచిన పార్టీ.. 2022లో కేవలం మూడింటికే పరిమితమైంది. మరోవైపు ఆరేళ్లుగా ఒంటరి పోరాటం చేసిన బీజేపీ గ్రామీణ పంజాబ్‌లో పట్టు సాధించలేక మళ్లీ పాత మిత్రుడి గడప తొక్కింది. రైతుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు.. డ్రగ్స్ ఆరోపణలు, అపవిత్ర ఘటనల వివాదాలు అకాలీదళ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. బీజేపీ కార్యకర్తల్లోనూ పొత్తుపై అసంతృప్తి రగులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా మూడు నెలల్లో రైతుల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇవ్వడం, 2029 నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రకటించడం కొత్త చర్చకు తెరలేపాయి. మరోవైపు ఆప్ సంక్షేమ అస్త్రాలతో మళ్లీ అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే.. కాంగ్రెస్ పునరాగమనానికి పావులు కదుపుతోంది. అమరీందర్ సింగ్ గైర్హాజరు కూడా రాజకీయ రహస్యాలకు ఆజ్యం పోస్తోంది. మరి ఈ పొత్తు గేమ్‌చేంజరా? లేక మూడో స్థానానికే పరిమితమయ్యే రాజకీయ ప్రయోగమా? పంజాబ్ ఓటరు తీర్పు కోసం దేశం ఎదురుచూస్తోంది!
#PunjabPolitics #BJPAkaliAlliance #BJP #AkaliDal #AAP #Congress #PunjabElections #AmitShah #PunjabFarmers #PunjabNews











