Home Sports_News ఏషియన్‌ గేమ్స్‌లో షెడ్యూల్‌ ట్విస్ట్‌

ఏషియన్‌ గేమ్స్‌లో షెడ్యూల్‌ ట్విస్ట్‌

టీమిండియాకు కొత్త టైమింగ్! షెడ్యూల్‌ మార్పు.

జపాన్‌లో జరగనున్న ఏషియన్‌ గేమ్స్‌ 2026లో టీమిండియా పోరుకు షెడ్యూల్‌ ట్విస్ట్‌ వచ్చింది. డిఫెండింగ్‌ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్న భారత పురుషుల జట్టు క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌ సమయాన్ని 30 నిమిషాలు ముందుకు మార్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌ 28న జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ మొదట స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్ణయించగా.. ఇప్పుడు 1:30 గంటలకే ప్రారంభం కానుంది. అంటే భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకే మ్యాచ్‌ మొదలవుతుంది. అక్టోబర్‌ 1 సెమీఫైనల్‌, అక్టోబర్‌ 3 ఫైనల్‌ సమయాల్లోనూ ఇదే మార్పు వర్తించనుంది. మిగతా మ్యాచ్‌లు మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే సాగనున్నాయి. పురుషుల విభాగంలో భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక నేరుగా క్వార్టర్‌ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. మరోవైపు గ్రూప్‌ దశ నుంచి ఆఫ్ఘనిస్థాన్‌, జపాన్‌, నేపాల్‌ అలాగే హాంకాంగ్‌ చైనా, మలేషియా, ఒమన్‌ టాప్‌-8 కోసం పోరాడనున్నాయి. అసలు మజా ఇక్కడే.. భారత్‌–పాకిస్థాన్‌ హైఓల్టేజ్‌ పోరు క్వార్టర్స్‌లో ఉండదు. ఇరు జట్లు సెమీఫైనల్‌ లేదా ఫైనల్లో మాత్రమే ఢీకొనే అవకాశం ఉండటంతో టోర్నీపై ఉత్కంఠ మరింత పెరిగింది.

 

#AsianGames2026 #AsianGames #AsianGamesSchedule #TeamIndia #IndiaCricket #IndiaAsianGames #AsianGamesCricket #IndiaQuarterfinal #IndiaPakistan #IndiaVsPakistan #IndiaPakistanCricket #AsianGamesQuarterfinal #AsianGamesSemifinal #AsianGamesFinal #JapanAsianGames #IndianCricket #CricketNews #TeamIndiaNews #AsianGames2026Schedule