Home AP మెగా డీఎస్సీ పిల్‌కు హైకోర్టు నో

మెగా డీఎస్సీ పిల్‌కు హైకోర్టు నో



ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తు కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ముఖ్యంగా క్రీడాకోటా నియామకాలపై విచారణ కోరిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, నేరుగా నష్టపోయిన అభ్యర్థులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని ప్రశ్నించింది. బాధితులు భయపడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించినా, ఆ వివరణతో కోర్టు ఏకీభవించలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తే వాటి అసలు ఉద్దేశం దెబ్బతింటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌, నియామకాలపై ఇప్పటికే 335 మంది అభ్యర్థులు వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారని గుర్తుచేసింది. ప్రత్యక్ష న్యాయపరమైన మార్గాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ పిల్‌ను కొనసాగిస్తారా లేక ఉపసంహరించుకుంటారా అని పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ సూచనలు తీసుకురావాలని న్యాయవాదిని ఆదేశించింది. మరోవైపు మెగా డీఎస్సీ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

 

#MegaDSC2025 #MegaDSC #APHighCourt #DSCRecruitment #MegaDSCRecruitment #CBIProbe #DSCIrregularities #APDSC #AndhraPradesh #APPolitics #YSRCP #TeacherRecruitment #SportsQuota #EducationNews #CourtNews