Home AP నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మండలిలో సత్తా చాటుతామంటున్న వైసీపీ

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మండలిలో సత్తా చాటుతామంటున్న వైసీపీ



ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమరావతి వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. భద్రతతో పాటు సభ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఈ సమావేశాలు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య రాజకీయ వేడికి వేదికగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షం సిద్ధమవుతుండగా.. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కూటమి కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

రైతులు, ఉద్యోగుల సమస్యలే అజెండా

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు. ప్రజా సమస్యలను మండలిలో బలంగా ప్రస్తావించాలని ఆదేశించారు. ఉపాధ్యాయ నియామకాల్లో డీఎస్సీ-2025 పరీక్షకు సంబంధించిన ఆరోపణలు, ఔట్‌సోర్సింగ్‌ వ్యవహారాలు, రైతుల సమస్యలను ప్రధానంగా లేవనెత్తాలని సూచించారు. పంటలకు కనీస మద్దతు ధర అందడం లేదని, సాగునీటి కొరత ఉందని, ఉచిత పంటల బీమా నిలిచిపోయిందని జగన్‌ ఆరోపించారు. అన్ని అంశాలపై పూర్తి సమాచారంతో సభకు హాజరై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

#APAssembly #AndhraPradeshAssembly #APAssemblySessions #APPolitics #LegislativeCouncil #YSRCP #YSJagan #JaganMohanReddy #AndhraPradeshPolitics #Amaravati #FarmersIssues #EmployeeIssues #DSC2025 #APGovernment #PoliticalNews