Home AP బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి దర్శనం

బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి దర్శనం

నేడు రూ.300 టికెట్లు విడుదల!
అక్టోబర్ 12 నుంచి దర్శనాలకు ఛాన్స్ .

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సమాచారం ఇచ్చింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అక్టోబర్‌ 7న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 12, 13, 14, 18, 19, 20 తేదీల దర్శనాలకు సంబంధించిన టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే పొందాలని అధికారులు సూచించారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. అదే సమయంలో పెరటాసి మాసం చివరి వారం కావడంతో తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ప్రత్యేక హోదా దర్శనాలను రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్నారైలు, రక్షణ సిబ్బందికి కల్పించే ప్రత్యేక దర్శనాలు కూడా ఈ కాలంలో ఉండవు. అక్టోబర్‌ 10 నుంచి 19 వరకు ప్రోటోకాల్‌ వీఐపీలు మినహా సిఫారసు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని తిరుమల ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని కోరింది. టికెట్లు అధికారిక వెబ్‌సైట్‌: ttdevasthanams.ap.gov.inలో లభిస్తాయి.

 

#Tirumala #TTD #TirumalaDarshan #TTDTickets #Rs300Darshan #SpecialEntryDarshan #TirumalaTickets #Brahmotsavam2026 #NavaratriBrahmotsavam #SrivariBrahmotsavam #Tirupati #TTDOnlineBooking #TirumalaNews #LordVenkateswara #TirupatiNews