ఏడాదిలో స్టార్ స్థాయి పెంపు.
సమీక్షలో మంత్రి నారా లోకేశ్ .
ఉండవల్లి నివాసంలో పాఠశాలల మౌలిక వసతులు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని జీరో స్టార్ పాఠశాలలను ఏడాదిలోగా వన్ స్టార్‌గా, వన్ స్టార్ స్కూళ్లను టూ స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. 2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు స్టార్ స్థాయి మౌలిక వసతులు కల్పించేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. కనీసం 1,000 పాఠశాలలను ఫైవ్ స్టార్ స్థాయికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పాఠశాలల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్ స్టార్, 15,618 టూ స్టార్, 19,099 త్రీ స్టార్, 7,172 ఫోర్ స్టార్ పాఠశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని లోకేశ్ స్పష్టం చేశారు.
స్కిల్ ట్రైనింగ్‌తో ఉపాధికి బాట
రాష్ట్రంలోని 7,000 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్, జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్‌ను సమర్థంగా వినియోగించాలని సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్య శిక్షణతో పాటు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లోనూ శిక్షణ అందించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంచి విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించాలని లోకేశ్ స్పష్టం చేశారు.
#APGovernmentSchools #NaraLokesh #SchoolInfrastructure #FourStarSchools #FiveStarSchools #APEducation #AndhraPradesh #LEAPSchools #GovernmentSchools #EducationReforms #SkillDevelopment #PMKVY #AtalTinkeringLabs #ComputerLabs #SchoolDevelopment











