భారత్ తరఫున తనూజా ప్రసంగం.
అరకు వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజా రాణికి అంతర్జాతీయ వేదికపై కీలక అవకాశం దక్కింది. ఐరాస 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా ఫిఫ్త్ కమిటీ తొలి అధికారిక సమావేశంలో భారత్ తరఫున ఆమె ప్రకటన చేశారు. పరిపాలన, బడ్జెట్ వ్యవహారాలను పరిశీలించే ఈ కమిటీలో ‘ఆర్గనైజేషన్ ఆఫ్ వర్క్’ అంశంపై భారత వైఖరిని వెల్లడించారు. ఐరాస సంస్కరణల అజెండాను 81వ సెషన్లో ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పరిపాలనా, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, సమర్థత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫిఫ్త్ కమిటీ పనిలో ప్రోగ్రామ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ, అడ్వైజరీ కమిటీ వంటి సంస్థల అధికారాలను గౌరవించడం కీలకమని స్పష్టం చేశారు.
సకాలంలో నిధులు.. అభివృద్ధికి ప్రాధాన్యం
ఐరాస కార్యకలాపాలు సజావుగా సాగాలంటే సభ్య దేశాల ఆర్థిక సహకారం కీలకమని తనూజా రాణి పేర్కొన్నారు. సభ్య దేశాలు తమపై విధించిన ఆర్థిక వాటాలను పూర్తిగా, సకాలంలో, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చెల్లించాలని భారత్ తరఫున కోరారు. అభివృద్ధి కార్యక్రమాలకు తగినన్ని నిధులు కేటాయించాలని సూచిస్తూ, ఐరాస అభివృద్ధి స్తంభాన్ని బలోపేతం చేసేందుకు యూఎన్80 ఇనిషియేటివ్ను సమర్థంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ఫిఫ్త్ కమిటీ చర్చల్లో సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయ నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా అంతర్జాతీయ వేదికపై దేశ వైఖరిని వెల్లడించిన తనూజా రాణి ప్రసంగం, అరకు నుంచి ఢిల్లీ వరకు సాగిన రాజకీయ ప్రయాణానికి మరో కీలక మైలురాయిగా నిలిచింది.
#GummaThanujaRani #ThanujaRani #ArakuMP #UNGA2026 #UnitedNations #UNFifthCommittee #IndiaAtUN #UNGeneralAssembly #YSRCP #UNReforms #UNBudget #UNDevelopment #IndianParliament #AndhraPradeshPolitics #InternationalForum











