ఈసీ, ఈవీఎంలపై విమర్శలు.
కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్.
ప్రధాని నరేంద్ర మోదీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే కాంగ్రెస్ ఈసీ, ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌పై ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం వరుసగా మూడుసార్లు ప్రజల మద్దతు పొందిందని, దేశ ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వాన్ని బ్రిటిష్ పాలనతో పోల్చడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌లో గెలిచినప్పుడు ఈవీఎంలు, ఎన్నికల సంఘం పనితీరుపై ఎందుకు ప్రశ్నలు రాలేదని బండి సంజయ్ నిలదీశారు. కేరళలో ఎస్‌ఐఆర్ ద్వారా బోగస్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించడం తమకు ప్రయోజనకరంగా ఉందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఓటరు జాబితా పవిత్రంగా ఉండాలి
ఎస్‌ఐఆర్ కొత్త ప్రక్రియ కాదని, గతంలోనూ అమలైందని, సుప్రీంకోర్టు దీనిని సమర్థించిందని బండి సంజయ్ తెలిపారు. అర్హులైన ఓటర్ల హక్కు కాపాడుతూనే డూప్లికేట్, మరణించిన వారి ఓట్లు తొలగించడమే ప్రక్రియ ఉద్దేశమని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ను అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులేనని, అయినా కాంగ్రెస్ కేంద్రంపై బాధ్యత నెట్టడం సరికాదని విమర్శించారు. ఓటు ఎంత పవిత్రమో ఓటరు జాబితా కూడా అంతే పవిత్రంగా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని బండి సంజయ్ ఆరోపించారు.
#BandiSanjay #Congress #BJP #ECI #ElectionCommission #EVM #SIR #SpecialIntensiveRevision #GyaneshKumar #VoterList #ElectoralRoll #DuplicateVoters #DeceasedVoters #RameshChennithala #PoliticalNews











