ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత డీఎస్సీ వ్యవహారంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్న వారిపై తీవ్రంగా స్పందించారు. రౌడీషీటర్లు, పలు కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు కూడా పేపర్ లీకులు, అక్రమాల పేరుతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో ఉపాధ్యాయులపై దాడులు జరిగాయని, ఆ ఘటనపై రాజకీయ రగడకు దిగడం సరికాదన్నారు. ప్రశ్నించేందుకు అసెంబ్లీ, న్యాయం కోరేందుకు కోర్టులు ఉన్నాయని, వాటిని పక్కనపెట్టి దాడులు, బెదిరింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల గౌరవం, ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసని, చివరికి నిజానిజాలను ప్రజలే నిర్ణయిస్తారని అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు
#VangalapudiAnitha #APDSC #DSCControversy #DSCRecruitment #AndhraPradesh #APPolitics #HomeMinisterAnitha #TeacherProtest #TeacherSafety #Vijayawada #DSCPaperLeak #DSCIrregularities #LawAndOrder #APGovernment #DSCNews











