Home AP ఏపీ హైకోర్టులో ఐదుగురికి శాశ్వత హోదా

ఏపీ హైకోర్టులో ఐదుగురికి శాశ్వత హోదా

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి శాశ్వత హోదా లభించింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తోట చంద్ర ధన శేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఇకపై శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కొలీజియం సమావేశంలో చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోద ముద్ర వేయడంతో ఈ నియామకాలు ఖరారయ్యాయి. వీరిలో జస్టిస్‌ మహేశ్వరరావు కుంచం, జస్టిస్‌ తోట చంద్ర ధన శేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ 2024 అక్టోబర్‌ 28న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. తాజాగా కేంద్ర ఆమోదంతో ఐదుగురి పదవులు శాశ్వతంగా మారాయి.

 

#APHighCourt #AndhraPradeshHighCourt #PermanentJudges #SupremeCourtCollegium #MaheswaraRaoKuncham #TCDSekhar #ChallaGunaranjan #HariHaranadhaSarma #YadavalliLakshmanaRao #JudicialAppointments #APJudiciary #HighCourtJudges #AndhraPradesh #LegalNews #Judiciary