Home National_news 🎓 నీట్ లీక్ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి.. ప్రధానికి CJP బహిరంగ...

🎓 నీట్ లీక్ బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి.. ప్రధానికి CJP బహిరంగ లేఖ!

46

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. గత వారం రోజుల్లో 11 మంది నీట్ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఐదుగురు కేవలం 48 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, పరీక్షా వ్యవస్థలోని లోపాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.

భవిష్యత్తుపై ఆశలతో తమ పిల్లల విద్య కోసం అనేక కుటుంబాలు భారీ విద్యా రుణాలు తీసుకున్నాయని, ఇప్పుడు ఆ పిల్లలను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అభిజిత్ దీప్కే లేఖలో పేర్కొన్నారు. రీ-ఎగ్జామ్స్ భయం, అనిశ్చితి, మానసిక ఒత్తిడి యువతను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని CJP డిమాండ్ చేసింది. “మా ప్రాణాలను కోల్పోయిన విద్యార్థులకు న్యాయం జరగాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని విద్యార్థుల తరఫున ఆయన ప్రభుత్వాన్ని కోరారు.