Home Telangana దానం కేసులో బీఆర్‌ఎస్‌ అప్రమత్తం సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు

దానం కేసులో బీఆర్‌ఎస్‌ అప్రమత్తం సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు

దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ మరో కీలక అడుగు వేసింది. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దానం నాగేందర్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముందస్తుగా ఈ చర్య చేపట్టింది. దానం నాగేందర్‌ తరఫున పిటిషన్‌ దాఖలైతే, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కేవియట్‌లో కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడం అనర్హతకు కారణమైంది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది. తీర్పు అనంతరం తదుపరి న్యాయపరమైన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

 

#DanamNagender #BRS #SupremeCourt #BRS_Caveat #DanamDisqualification #Khairatabad #TelanganaHighCourt #AntiDefectionLaw #DefectionCase #BRSvsCongress #KhairatabadBypoll #TelanganaPolitics #SupremeCourtCase #TelanganaNews #DanamNagenderCase