Home AP శ్రీవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు

శ్రీవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు

15వసారి స్వామివారికి సమర్పణ.
ప్రతి హిందువు జీవితంలో..
ఒక్కసారైనా శ్రీవారి దర్శించుకోవాలి.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆయన.. సీఎం హోదాలో 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దేశం, ఆంధ్రప్రదేశ్‌ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు సేవలందిస్తున్న తితిదే పాలకమండలి, అధికారులు, సిబ్బందిని సీఎం అభినందించారు. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆకాంక్షించారు.

తిరుమలలో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి పెద్దశేష వాహన సేవలో చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 2027 తితిదే డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. బుధవారం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీఐపీ క్యూ కాంప్లెక్స్‌లో యాత్రికుల అనుభవ కేంద్రం, గోగర్భం డ్యామ్‌ వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించి అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

 

#ChandrababuNaidu #Chandrababu #Tirumala #TirumalaTemple #LordVenkateswara #SrivariBrahmotsavam #TirumalaBrahmotsavam #TTD #TTDBrahmotsavam #SilkRobes #PattuVastralu #ChandrababuTirumala #VenkateswaraSwamy #MalayappaSwamy #PeddasheshaVahanaSeva #TTD2027 #TTDDiary #TTDCalendar #TirumalaNews #AndhraPradesh #APNews #DevotionalNews #HinduTemples