Home Telangana రేవంత్‌ ఫ్లాష్‌ సర్వే.. అటు చాణక్య సర్వే

రేవంత్‌ ఫ్లాష్‌ సర్వే.. అటు చాణక్య సర్వే

ఎవరి లెక్కలు వాళ్లవి.. తెలంగాణలో సెగ.
మూడేళ్లకే మారిందా తెలంగాణ రాజకీయ మూడ్.
రేవంత్‌ బలమేంటి.. బీఆర్‌ఎస్‌ వ్యూహమేంటి?
బీజేపీ ఎటు.. ఓటు లెక్కలు ఎటు!
అసలేం జరుగుతోంది.. తెలంగాణ తీర్పు ఎటు?

ఫ్లాష్‌ సర్వే నిజంగా ఏం చెబుతోంది? అసెంబ్లీ రగడపై ప్రజల స్పందన అంతేనా.. లేక రాబోయే ఎన్నికల రాజకీయానికి ఇది ముందస్తు సంకేతమా? రేవంత్‌రెడ్డి ఇంత ధీమాగా ఎందుకు ఉన్నారు? ఆయన చేతిలో ఉన్న అధికార బలం ఎంత? పాలనపై ప్రజల్లో అసలు అభిప్రాయం ఏమిటి? బీఆర్‌ఎస్‌ ప్రతిరోజూ రేవంత్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తోంది? ఇది వ్యూహమా.. లేక అదే రేవంత్‌కు రాజకీయ ఆక్సిజన్‌గా మారుతోందా? “రేవంత్‌ వద్దు” అంటున్న బీఆర్‌ఎస్‌.. “మరి బీఆర్‌ఎస్‌ ఎందుకు కావాలి?” అన్న ప్రశ్నకు సమాధానం సిద్ధం చేసిందా? కుటుంబం, బ్రదర్స్‌, భూములు, ధరణి వంటి ఆరోపణలు ప్రజల్లో ఎంత ప్రభావం చూపుతున్నాయి? కాంగ్రెస్‌లో వినిపిస్తున్న అసంతృప్తి నిజంగా రేవంత్‌కు బలహీనతేనా.. లేక వాటినే తనకు అనుకూలంగా మలచుకునే రాజకీయ నైపుణ్యం ఆయనకు ఉందా? మరి బీజేపీ ఎక్కడ నిలబడింది? గ్రేటర్‌ గేమ్‌లో మూడో శక్తిగా దూసుకొస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఓటు లెక్కలు ఎలా మారతాయి? నగర ఓటర్‌ ఏం కోరుకుంటున్నాడు? రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్‌, ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి.. వీటిలో ఏది ఓటును నిర్ణయించబోతోంది? ఫ్లాష్‌ సర్వేలో కనిపించిన స్పందనకు గ్రౌండ్‌లోని ప్రజా మనోభావానికి ఎంత దూరం ఉంది? రేవంత్‌ బలం ఎక్కడ? బీఆర్‌ఎస్‌ బలహీనత ఎక్కడ? బీజేపీ అవకాశం ఎక్కడ? అసలు తెలంగాణ ప్రజల నాడి ఎటు? మాటల యుద్ధం ముదురుతున్న వేళ.. అధికారానికి దారి ఎవరిది? రేవంత్‌ను బలహీనపరచే బీఆర్‌ఎస్‌ వ్యూహమే చివరకు ఆయన్ను బలపరుస్తోందా? లేక తెర వెనుక మారుతున్న గ్రౌండ్‌ మూడ్‌ మరో కథ చెబుతోందా? ఇదే తెలంగాణ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

#RevanthReddy #TelanganaPolitics #TelanganaSurvey #FlashSurvey #ChanakyaSurvey #BRS #BRSStrategy #BJP #BJPTelangana #TelanganaElections #Telangana2029 #GreaterHyderabad #TelanganaVoters #PoliticalMood #Congress