నియామకాలపై ప్రశ్నలు.. సమాధానాలపై ఫోకస్ .
డీఎస్సీ నియామక ప్రక్రియపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఏపీ రాజకీయాలతో పాటు నిరుద్యోగ యువతలోనూ చర్చకు దారితీశాయి. జీవోల క్రమం, నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు, పరీక్ష పత్రాల తయారీ, పర్యవేక్షణలో కీలక బాధ్యతల కేటాయింపు, పరీక్ష లేకుండా క్రీడా కోటాలో 372 పోస్టుల భర్తీ వంటి అంశాలపై జగన్ వివరణ కోరుతున్నారు. ఈ ప్రశ్నల వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయా, లేక నియామక ప్రక్రియపై సహజంగా తలెత్తే పరిపాలనా సందేహాలా అన్నది పక్కన పెడితే.. వాటికి స్పష్టమైన వివరాలు వెలువడటం ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపు ప్రశ్నలు లేవనెత్తిన వారు తమ వాదనలకు ఆధారాలు చూపాల్సిన అవసరం ఉంటే.. మరోవైపు ప్రభుత్వం కూడా ఒక్కో అంశంపై అధికారిక పత్రాలతో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే డీఎస్సీ వ్యవహారం కేవలం రాజకీయ పార్టీల మధ్య వివాదంగా చూడలేం.. వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు, నియామక వ్యవస్థపై వారి నమ్మకంతో ముడిపడి ఉన్న అంశం. ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యత ఎవరిది అన్నది తేలాలి.. సందేహాలకు ఆధారం లేకపోతే ప్రభుత్వం ఇచ్చే వివరణతో అదే విషయం స్పష్టమవ్వాలి. చివరికి ఈ వ్యవహారంలో రాజకీయ విజయాపజయాల కంటే నియామకాలపై పారదర్శకత, మెరిట్, అభ్యర్థుల విశ్వాసమే కీలకం.
#YSJagan #JaganMohanReddy #MegaDSC #MegaDSC2025 #APDSC #DSCRecruitment #DSCAppointments #MegaDSCControversy #DSCTransparency #DSCRecruitmentProcess #TeacherRecruitment #APTeacherJobs #SportsQuota #372Posts #DSCAllegations #DSCExam #DSCMerit #UnemployedYouth #APGovernment #AndhraPradeshPolitics #APPolitics #JaganNews #APNews











