Home Sports_News బిగ్‌బాష్‌ తలుపులు తెరిచింది!

బిగ్‌బాష్‌ తలుపులు తెరిచింది!

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌ మొదలైంది. క్రికెట్‌ ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌లోకి ప్రైవేట్‌ పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీల కన్ను ఆస్ట్రేలియా మార్కెట్‌పై పడింది. 2027–28 సీజన్‌ నుంచి మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ను 100 శాతం ప్రైవేట్‌ యాజమాన్యానికి అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న రిలయన్స్‌, ఆర్‌పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌, జీఎంఆర్‌–జేఎస్‌డబ్ల్యూ, రెడ్‌ చిల్లీస్‌ వంటి భారతీయ సంస్థలకు ఇది మరో భారీ అవకాశంగా మారింది. ఒకే యాజమాన్యం కింద ఐపీఎల్‌, బీబీఎల్‌, ఎస్‌ఏ20, ఎంఎల్‌సీ జట్లను నడిపితే ఆటగాళ్లతో ఏడాది పొడవునా అనుబంధం పెంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే భారత క్రికెటర్లకు విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వకపోవడం ఇప్పటికీ పెద్ద అడ్డంకే. మరోవైపు క్రికెట్‌ ఆస్ట్రేలియా షెడ్యూల్‌, ఆటగాళ్ల లభ్యత, ప్రసార హక్కులు, సాలరీ క్యాప్‌పై నియంత్రణ కొనసాగించనుంది. బీబీఎల్‌ జట్టు విలువ 15–20 కోట్ల ఆస్ట్రేలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చన్న అంచనాలు ఆసక్తిని పెంచుతున్నాయి. టీ20 క్రికెట్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో ఇది కొత్త పవర్‌ గేమ్‌కు నాంది కానుందా?

 

#BigBashLeague #BBL #BBL2027 #BBLFranchise #PrivateOwnership #PrivateInvestment #MelbourneRenegades #IPL #IPLFranchises #CricketAustralia #AustralianCricket #T20Cricket #T20Franchise #Reliance #RPSanjivGoenkaGroup #GMRJSW #RedChillies #GlobalT20 #CricketBusiness #CricketInvestment #BBLNews #IndianInvestors #CricketNews