Home Health News 🚨 స్వచ్ఛ భారత్ నుంచి స్వచ్ఛ నీరు ఎప్పుడూ?

🚨 స్వచ్ఛ భారత్ నుంచి స్వచ్ఛ నీరు ఎప్పుడూ?

47

🚨 కలుషిత నీటితో 100 మందికి పైగా అస్వస్థత… మంగళూరులో కలకలం!

కర్ణాటకలోని మంగళూరు నగరంలో తాగునీటి కలుషితంతో 100 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. బేజై న్యూ రోడ్, బట్టగుడ్డె తదితర ప్రాంతాల ప్రజలు వాంతులు, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల రోజులుగా చిన్నారులు సహా పలువురు అనారోగ్యానికి గురవుతుండటంతో అధికారులు నీటి నమూనాలను పరీక్షించగా, మంగళూరు సిటీ కార్పొరేషన్ (MCC) సరఫరా చేస్తున్న తాగునీరు పూర్తిగా వినియోగానికి అనర్హమని తేలింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి పైపులు, డ్రైనేజీ లైన్లు సమీపంలో ఉండటం, ఇటీవల జరిగిన తవ్వకాల వల్ల పైపులు దెబ్బతినడంతో మురుగునీరు తాగునీటిలో కలిసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన మంగళూరు దక్షిణ ఎమ్మెల్యే వేదవ్యాస్ కామత్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. కాలుష్యానికి మూల కారణాలను వెంటనే గుర్తించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు.