స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతి స్థానంలోనూ పోటీ చేసి, పోరాటంతో విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఇంతకుముందెన్నడూ చూడలేదని, టీవీలు, పత్రికల్లో ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయని ఆరోపించారు. టెట్ విషయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టెట్‌ను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చని చెబుతున్న వారు.. టెట్ రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై ప్రశ్నించినందుకు వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడేది లేదని, డీఎస్సీ అక్రమాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు తిండి కోసం ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, స్థానిక ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని బొత్స పిలుపునిచ్చారు.
#BotsaSatyanarayana #Botsa #YSRCP #YSRCPLeaders #YSRCPCadre #LocalBodyElections #APLocalElections #APPolitics #YSRCPElectionStrategy #Kakinada #KakinadaYSRCP #ChandrababuNaidu #NaraLokesh #TET #APTET #DSC #DSCControversy #YSRCPProtest #CoalitionGovernment #AndhraPradeshPolitics #LocalPolls #YSRCPNews











