వెలిగొండ, పోలవరం విజయాలకు ఘన గౌరవం.
అమరావతి వేదికగా జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబుకు మంత్రులు అరుదైన గౌరవం ఇచ్చారు. చంద్రబాబు కేబినెట్ హాల్లోకి అడుగుపెట్టగానే మంత్రులంతా ఒక్కసారిగా లేచి నిలబడి చప్పట్లతో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలలైన వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువను విజయవంతంగా ప్రారంభించినందుకు చంద్రబాబుకు మంత్రులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆయన పట్టుదల, ప్రాజెక్టులపై చూపిన దృష్టి వల్లే ఈ పనులు పూర్తయ్యాయని కొనియాడారు. అనంతరం సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ సమావేశంలో ప్రాజెక్టుల పురోగతితో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చంద్రబాబు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సవాళ్లను ఎదుర్కొని, నిర్ణయించిన సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం పట్ల మంత్రులు ఈ స్థాయిలో గౌరవం చూపడం కూటమి ప్రభుత్వంలో సమన్వయం, చంద్రబాబు నాయకత్వంపై మంత్రుల నమ్మకానికి సంకేతంగా ప్రభుత్వ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
#ChandrababuNaidu #APCabinet #AndhraPradesh #VelugondaProject #Polavaram #PolavaramProject #PolavaramLeftMainCanal #APDevelopment #ChandrababuLeadership #APPolitics #CabinetMeeting #Amaravati #CoalitionGovernment #AndhraPradeshNews











