Home AP డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు వైఎస్ జగన్‌‌పై నారా లోకేశ్ విమర్శలు

డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు వైఎస్ జగన్‌‌పై నారా లోకేశ్ విమర్శలు

విజయనగరంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ కేడర్‌ సమావేశంలో మంత్రి నారా లోకేశ్‌ వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ‘గొడ్డలి పార్టీ’ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

అక్రమ కేసులు రద్దు చేస్తాం

టీడీపీ కార్యకర్తలపై గతంలో ఎక్కడెక్కడ అక్రమ కేసులు నమోదు చేశారో వాటన్నింటినీ రద్దు చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ‘రెడ్‌ బుక్‌ తన పని తాను చేసుకుపోతుంది’ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.

మూడు పర్యాయాలు అధికారమే లక్ష్యం

రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగంగా జరగాలంటే టీడీపీ మూడు పర్యాయాలు అధికారంలో ఉండాలని లోకేశ్‌ అన్నారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. 2023–24లో ‘భవిష్యత్‌ గ్యారంటీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉత్తమ పనితీరు కనబరిచిన 100 మంది టీడీపీ కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా కేడర్‌లో మరింత ఉత్సాహం పెరుగుతుందని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

#NaraLokesh #YSJagan #JaganMohanReddy #DSC #APPSC #TDP #YSRCP #AndhraPradeshPolitics #Lokesh #Jagan #TDPMeeting #Vizianagaram #RedBook #LocalBodyElections #TDPWorkers #APPolitics #PoliticalNews