Home Telangana పొంగులేటి రాజీనామా చేయాల్సిందే 22ఏ భూములపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్‌

పొంగులేటి రాజీనామా చేయాల్సిందే 22ఏ భూములపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్‌


నిషేధిత జాబితాపై తీవ్ర ఆరోపణలు.

తెలంగాణలో ప్రజాపాలన కాకుండా దోపిడీ పాలన సాగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ తీవ్ర విమర్శలు చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై మంత్రి బాధ్యత వహించాలని, 22ఏ జాబితాను బహిర్గతం చేసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసం కూడా నిషేధిత జాబితాలో చేరిందని పేర్కొన్న లక్ష్మణ్‌, ప్రజలు కష్టపడి సంపాదించిన భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా నడుస్తోందని విమర్శించారు. అధికారులను మాత్రమే బాధ్యులుగా చేయకుండా, నిషేధిత జాబితాలో భూములను చేర్చాలని ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బీఆర్ఎస్‌ హయాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కాంగ్రెస్‌ ప్రభుత్వం కోటి ఎకరాలను ఆ జాబితాలోకి నెట్టిందని ఆరోపించారు. ప్రజల ఆస్తులు కాపాడేందుకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

 

#PonguletiSrinivasReddy #BJP #Laxman #22ALands #22AProperties #Telangana #TelanganaPolitics #TelanganaGovernment #LandIssue #ProhibitedLands #CBIProbe #RevenueDepartment #RevanthReddy #PoliticalNews #TelanganaNews