నారావారి చాణక్యంతో రసకందాయంలో రాజకీయ ఖిల్లా.
నెల్లూరు పెద్దారెడ్డి కాదు.. పుంగనూరు పెద్దిరెడ్డి ఇక్కడ!
చిత్తూరు గాంధీ రోడ్డా.. లేక తిరుపతి లీలామహల్ సెంటరా..!
స్పాట్ నువ్వు చెప్పినా సరే.. టైం నన్ను చెప్పమన్నా సరే.. దేనికైనా రెఢీ..
ఉమ్మడి చిత్తూరులో పెద్దిరెడ్డి.. నారావారి హైఓల్టేజ్ ఛాలెంజ్.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటేనే రాజకీయ హైఓల్టేజ్‌కు కేరాఫ్ అడ్రస్! తిరుమల కొండంత ప్రతిష్ఠ.. పుంగనూరు రాజకీయాలంత వేడి.. కుప్పం అంత బలమైన కోట.. చంద్రగిరి అంత ఉత్కంఠ.. తిరుపతి అంత వైవిధ్యం.. అన్నీ కలిస్తేనే చిత్తూరు రాజకీయ చిత్రం! ఇక్కడ నేతలు వ్యూహాలు రచిస్తారు.. పార్టీలు పొత్తులు కడతాయి.. అభ్యర్థులు సవాళ్లు విసురుతారు.. కానీ చివరికి ఒక్క ఓటు మొత్తం లెక్కను తలకిందులు చేస్తుంది. 2019లో ఉమ్మడి చిత్తూరు జిల్లా దాదాపు వైసీపీ కంచుకోటగా మారింది. 14 స్థానాల్లో 13 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. కుప్పంలో మాత్రం నారా చంద్రబాబు తన కోటను కాపాడుకున్నారు. కానీ 2024 వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి ఏకంగా 12 స్థానాలు దక్కించుకోగా.. పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు, తంబళ్లపల్లెల్లో మాత్రమే తన పట్టు నిలబెట్టుకుంది. ఇప్పుడు అసలు ప్రశ్న మొదలైంది. పుంగనూరులో పెద్దిరెడ్డి రాజకీయ ప్రభావాన్ని నారా వ్యూహాలు ఢీకొంటాయా? కుప్పం నుంచి చంద్రబాబు ప్రభావం చిత్తూరు జిల్లా మొత్తం విస్తరిస్తుందా? తంబళ్లపల్లెలో తగ్గిన మెజారిటీ పెద్దిరెడ్డి కుటుంబానికి హెచ్చరికేనా? తిరుపతిలో జనసేన బలం కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? చంద్రగిరి, నగరి, పీలేరు, శ్రీకాళహస్తి వంటి నియోజకవర్గాల్లో 2029 నాటికి గాలి ఎటు తిరుగుతుంది? ఇదే ఇప్పుడు చిత్తూరు రాజకీయాల్లో హాట్ టాపిక్. స్పాట్ నువ్వు చెబుతావా.. టైం నన్ను చెప్పమంటావా అన్నంతగా సవాళ్లు విసురుకునే రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి తన కోటలను కాపాడుకోవాలి.. నారా కుటుంబం తన ప్రభావాన్ని విస్తరించాలి.. జనసేన తన స్థావరాలను బలోపేతం చేసుకోవాలి. కానీ ఈ హైఓల్టేజ్ పోరులో అసలు పవర్ మాత్రం ఒక్కరి చేతిలోనే ఉంది.. అది చిత్తూరు ఓటరు చేతిలో!
#ChittoorPolitics #Peddireddy #NaraFamily #ChandrababuNaidu #Punganur #Kuppam #Tirupati #Chandragiri #Tamballapalle #AndhraPradeshPolitics #TDP #YSRCP #JanaSena #APPolitics #2029Elections











