చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి హెడ్ కోచ్ ఎవరన్న చర్చకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన క్లూ ఇచ్చారు. ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సీఎస్కే కోచ్‌గా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని అశ్విన్ అభిప్రాయపడ్డారు. 2026 ఐపీఎల్ సీజన్ నిరాశాజనకంగా ముగిసిన తర్వాత స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సీఎస్కే విడిపోయింది. దీంతో కొత్త కోచ్ ఎంపికపై ఆసక్తి పెరిగింది. అత్యున్నత స్థాయిలో కోచింగ్ అనుభవం లేకపోయినా మోర్గాన్‌కు జట్టు నిర్మాణం, నాయకత్వంపై మంచి అవగాహన ఉందని అశ్విన్ పేర్కొన్నారు. 2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు తీసుకెళ్లిన మోర్గాన్‌కు అంతర్జాతీయ నాయకత్వ అనుభవం కూడా ఉంది. మరోవైపు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు అశ్విన్ తెలిపారు. అయితే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్ల బాధ్యతల కారణంగా ఆయనకు అవకాశం కష్టమని భావిస్తున్నారు. కనీసం వచ్చే ఏడాది సీఎస్కేకు మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వ మార్గదర్శకత్వం అవసరమని అశ్విన్ సూచించారు. ఆ తర్వాత మోర్గాన్ వంటి వ్యక్తి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నది ఆయన అంచనా. దీంతో ఫ్లెమింగ్ వారసుడిగా మోర్గాన్ పేరు ఇప్పుడు సీఎస్కే వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
#IanMorgan #CSK #ChennaiSuperKings #CSKCoach #StephenFleming #RavichandranAshwin #MSDhoni #IPL2026 #IPLNews #BrendonMcCullum #CSKNextCoach #CricketNews #IPL











