Home AP నిరసనలకు ప్రజల్లో అనూహ్య స్పందన డీఎస్సీ అక్రమాలపై పోరు సఫలమన్న సజ్జల

నిరసనలకు ప్రజల్లో అనూహ్య స్పందన డీఎస్సీ అక్రమాలపై పోరు సఫలమన్న సజ్జల



డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ తమ పోరాటానికి వచ్చిన స్పందనే డీఎస్సీ వ్యవహారంలో ప్రజలకు ఉన్న అనుమానాలను స్పష్టం చేస్తోందన్నారు. డీఎస్సీ అక్రమాలపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పకుండా నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శాంతియుత ర్యాలీలను అడ్డుకోవడం, తమ కార్యక్రమాలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, డీఎస్సీ సమస్యను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

సీబీఐ విచారణకు ఎందుకు భయం?

డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు బలమైన ఆధారాలు ఉన్నాయని సజ్జల పేర్కొన్నారు. ఉన్నతస్థాయిలోనే తప్పులు జరిగాయని, అందుకే కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణకు వెనుకాడుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తప్పించుకోలేరని అన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చేందుకు వరుసగా మరిన్ని తప్పులు చేశారని, అక్రమాలు బయటపడిన తర్వాత సర్టిఫికెట్లను కూడా మార్చే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సజ్జల డిమాండ్ చేశారు.

 

#SajjalaRamakrishnaReddy #APDSC #DSCIrregularities #DSCProtest #YSRCP #CBIInquiry #AndhraPradeshPolitics #APTeacherRecruitment #DSCScam #UnemployedYouth #StudentsProtest #ChandrababuNaidu #NaraLokesh #APGovernment #EducationDepartment #APPoliticalNews