వృద్ధురాలికి సీఎం ఆత్మీయ అభయం.
చనిపోయేలోపు చంద్రబాబుతో ఫొటో దిగడమే ఆశ.
పరిపాలన కంటే ‘ప్రేమ’ గొప్పది.
చీరాల వృద్ధురాలి విజ్ఞప్తిపై స్పందించిన చంద్రబాబు.
తన జీవిత చరమాంకంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఒక ఫోటో దిగాలన్నదే తన ఏకైక కోరికని వెల్లడించిన చీరాల వయోవృద్ధురాలి విన్నపానికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఆమెను వ్యక్తిగతంగా కలుస్తానని సోషల్ మీడియా వేదికగా హామీ ఇచ్చారు.
బామ్మ మనసులోని మాట..
బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన కొమ్మాలపాటి పుష్పావతి (90) అనే వృద్ధురాలు మీడియా ముందుకు వచ్చి తన ఆకాంక్షను వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును కలవడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ అవకాశం దక్కలేదని, తాను చనిపోయేలోగా ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగే అవకాశాన్ని స్థానిక ఎమ్మెల్యే ముద్దలూరి మాలకొండయ్య కల్పించాలని వేడుకున్నారు.
సీఎం చంద్రబాబు స్పందన
ఈ వార్త సామాజిక మాధ్యమాలు, వార్తా కథనాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఆయన స్పందిస్తూ.. “అభిమానాన్ని చాటుకున్న పుష్పవతి అమ్మకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని స్వయంగా కలుస్తాను” అని ఆత్మీయంగా హామీ ఇచ్చారు.
నేడు సీఎం చంద్రబాబు చీరాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఈ వృద్ధురాలిని కలవనున్నారు.
#ChandrababuNaidu #Chirala #Pushpavathi #AndhraPradesh #APCM #NaraLokesh #EmotionalStory #Bapatla #Chandrababu #PublicConnect #APPolitics #TeluguNews #CMVisit #HumanInterest #ViralNews











