Home General సామాజిక సేవకు ఘన గౌరవం.. కరుణ్ రాజుకు ‘రాజ సింహ అవార్డు–2026’

సామాజిక సేవకు ఘన గౌరవం.. కరుణ్ రాజుకు ‘రాజ సింహ అవార్డు–2026’



పిఠాపురానికి చెందిన లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ టి. కామేశ్వరరావు (కరుణ్ రాజు)కి విశిష్ట సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక ‘రాజ సింహ అవార్డు–2026’ లభించింది. హైదరాబాద్ సమీపంలోని యాదగిరిగుట్ట న్యూ గుండ్లవెల్లిలో ఉన్న కె.యం. గ్రాండ్ హోటల్ ఫంక్షన్ హాల్‌లో ఆదర్శ కళానిలయం సంస్థ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో సత్కరించారు. ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆదర్శ కళానిలయం సంస్థ ఛైర్మన్ డాక్టర్ సి.హెచ్. ప్రకాశ్ చేతుల మీదుగా కరుణ్ రాజు ఈ అవార్డును అందుకున్నారు. విద్య, సామాజిక సేవ, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం ప్రకటించారు.

అవార్డు స్వీకరించిన అనంతరం కరుణ్ రాజు మాట్లాడుతూ, లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు లభించిన ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. భవిష్యత్తులో కూడా సమాజ అభ్యున్నతే లక్ష్యంగా మరింత అంకితభావంతో సేవలు కొనసాగిస్తానని తెలిపారు. ట్రస్ట్ కార్యకలాపాలకు ఆర్థికంగా, నైతికంగా తోడ్పడుతున్న దాతలు, సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురానికి చెందిన ప్రజాప్రతినిధులు, సామాజిక సేవా సంస్థల నాయకులు, పలువురు ప్రముఖులు కరుణ్ రాజును అభినందించారు. ఆయన సేవలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని కొనియాడారు.

 

#KarunRaju #RajaSimhaAward2026 #SocialService #LittleStarsTrust #Pithapuram #RuralDevelopment #EducationService #CommunityService #SocialWorker #Awards2026 #Yadagirigutta #Inspiration #APNews #BreakingNews #Humanity