Home AP విద్యార్థి, యువత సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాట.. నిరసన ర్యాలీ పోస్టర్ల విడుదల

విద్యార్థి, యువత సమస్యలపై వైఎస్సార్సీపీ పోరుబాట.. నిరసన ర్యాలీ పోస్టర్ల విడుదల



విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ చేపట్టనున్న నిరసన ర్యాలీ పోస్టర్లను వేంపల్లెలో ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు.స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు మాట్లాడుతూ… డీఎస్సీ నియామకాలలో అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి హామీ అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాదయాత్రగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం సమర్పిస్తామని, విద్యార్థులు, యువత సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పఠాన్ రహ్మతుల్లా ఖాన్, బాబా షరీఫ్, విశ్వనాథ్, సుదర్శన్, కమతం రాజా, సుభాన్, సాగర్, ప్రశాంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

 

#YSRCP #StudentProtest #YouthIssues #Vempalle #YSJaganMohanReddy #AndhraPradeshPolitics #NEETPaperLeak #DSCRecruitment #FeeReimbursement #UnemploymentBenefits #StudentWing #PoliticalProtest #APNews #BreakingNews #YouthVoice