రాష్ట్రంలో టీడీపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీని ఎన్నికలకు మరింత బలోపేతం చేసే దిశగా అధిష్ఠానం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నాయకత్వ మార్పులు, కొత్త బాధ్యతల అప్పగింతలతో జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావును నియమించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్‌తో సమన్వయంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించడం, రాష్ట్రంలో టీడీపీ కొత్త రాజకీయ వ్యూహానికి నాంది పలికిందనే చర్చకు దారితీస్తోంది.
విక్కుర్తికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు
అమరావతి: రాష్ట్రంలో టీడీపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా విక్కుర్తి వెంకట శ్రీనివాసరావును పార్టీ అధిష్ఠానం నియమించింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అమరావతిలో విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించినట్లు సమాచారం.











