Home AP తొలి ఏకాదశి వేడుకలకు శ్రీ అగస్త్యేశ్వర ఆలయం ముస్తాబు

తొలి ఏకాదశి వేడుకలకు శ్రీ అగస్త్యేశ్వర ఆలయం ముస్తాబు

Tholi Ekadashi 2026, Sri Agastyeswara Temple, Proddatur Temple, Agastyeswara Swamy, Shakambari Devi Alankaram, Rudrabhishekam, Ashadha Ekadashi, Andhra Pradesh Temples, Temple Festival, Proddatur News

37

ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25వ తేదీ శనివారం తొలి ఏకాదశి, ఆషాఢ మాస విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కె.వి. రమణ, ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, పాలకమండలి సభ్యులు తెలిపారు. ఉదయం శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు.

అనంతరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి 200 కిలోల కూరగాయలతో విశేష శాకంబరీ దేవి అలంకారం చేపట్టనున్నారు. భక్తులకు ప్రత్యేక తీర్థప్రసాదాలతో పాటు విశేష ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు.సాయంత్రం శ్రీ అగస్త్యేశ్వర స్వామివారు, అమ్మవార్లు, శ్రీ అభయవరద శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల ఉత్సవమూర్తుల మెరవణి ఆలయ తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి పుణ్యఫలాన్ని పొందాలని ఆలయ అధికారులు కోరారు.

మహేష్ పోసా
ప్రొద్దుటూరు
7337378783