చీరాల, జూన్ 24(నాదేశం) : మహిళల భద్రతే ధ్యేయంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో పట్టణంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తపేట పరిధిలోని ‘హాయ్ రెస్టారెంట్’ సమీపంలో శక్తి టీం సభ్యురాలు సిహెచ్. సునీత స్థానిక మహిళలతో ‘శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శక్తి టీం ప్రతినిధి సునీత మాట్లాడుతూ.. మహిళలు అత్యవసర సమయాల్లో తమను తాము కాపాడుకోవడానికి ‘శక్తి యాప్’ను మొబైల్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆపదలో ఆదుకునే హెల్ప్‌లైన్ నంబర్లు 112, 181, 1930, 1972 లపై అవగాహన కల్పించారు. అలాగే, అపరిచిత లింకులు ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. చిన్న పిల్లలకు ఇంట్లోనే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’లపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు.
#ShaktiApp #WomenSafety #Chirala #BapatlaPolice #WomenEmpowerment #SafetyAwareness #DSPMoin #SPUmamaheshwar #CyberSafety #GoodTouchBadTouch #ChildSafety #EmergencyHelpline #ShaktiTeam #AndhraPradeshPolice #PublicAwareness #CyberCrimeAwareness #WomenProtection #CommunityPolicing #ChiralaNews #SafetyFirst











