పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గే తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే రాబోయే టీ20 సిరీస్‌ల కోసం గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో సెలెక్టర్లు సూర్యాన్ష్‌ను ఎంపిక చేశారు. జూన్ 20న ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ఎడమ తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ నితీష్‌కు రిహాబిలిటేషన్ అవసరమని సూచించడంతో అతను ఈ రెండు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో ‘ఇండియా ఎ’ తరఫున సూర్యాన్ష్ షెడ్గే అద్భుత ప్రదర్శన చేశాడు. 23 ఏళ్ల ఈ ముంబై ఆల్‌రౌండర్ మిడిల్ ఆర్డర్‌లో 5 మ్యాచ్‌ల్లో 147 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై విజేతగా నిలవడంలో 251.92 స్ట్రైక్ రేట్‌తో మెరుపులు మెరిపించాడు. ఈ దేశీవాళీ ప్రదర్శనే అతనికి టీమిండియాలో చోటు కల్పించింది. నితీష్ కోలుకోవడానికి కనీసం నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
#SuryanshShedge #TeamIndia #IndianCricket #NitishKumarReddy #T20Series #IrelandSeries #EnglandSeries #PunjabKings #MumbaiCricket #BCCI #IndiaA #SyedMushtaqAliTrophy #CricketNews #SportsNews #BreakingNews











