భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ‘పద్మశ్రీ’ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు. భారత క్రికెట్‌కు రోహిత్ అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఈ కార్యక్రమానికి రోహిత్ తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు.దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో రోహిత్ శర్మ ఎన్నో అద్భుత రికార్డులను సృష్టించారు. ఆయన కెప్టెన్సీలో భారత్ 2024లో టీ20 ప్రపంచ కప్, ఆ తర్వాతి ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని ఐసీసీ ట్రోఫీల నిరీక్షణకు తెరదించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేలకు పైగా పరుగులు, 50 కి పైగా సెంచరీలు చేసిన ఘనత ఆయనది.ప్రస్తుతం టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో రోహిత్ కొనసాగుతున్నారు. ఈ అవార్డు తన కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని, దేశం కోసం మరిన్ని విజయాలు అందించడమే తన లక్ష్యమని రోహిత్ పేర్కొన్నారు.
#RohitSharma #PadmaShri #PadmaAwards #PresidentDroupadiMurmu #IndianCricket #TeamIndia #CricketLegend #RitikaSajdeh #T20WorldCup2024 #ChampionsTrophy #BCCI #CricketNews #SportsNews #IndiaPride #BreakingNews











