సీఎం రేవంత్ కోరినట్టుగా చేశా… కేంద్ర మంత్రులతో భేటీపై కిషన్ రెడ్డి

7

గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి హస్తిన వేదికగా ఫుల్ స్టాప్ పడింది. సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా కేంద్ర మంత్రులతో, కిషన్ రెడ్డి సమావేశాలు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు మెట్రో కథ పట్టాలెక్కినట్టుగా కన్పిస్తోంది. తాజాగా ఈ భేటీలపై కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రెండుసార్లు లేఖ రాశారని కిషన్ రెడ్డి వెల్లడించారు. సీఎం విజ్ఞప్తి మేరకు తానే చొరవ తీసుకుని ఈ సమావేశాలను సమన్వయం చేసినట్లు చెప్పారు. జూన్ 22న రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో, జూన్ 23న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సంయుక్త భేటీలు ఏర్పాటు చేయించానని పేర్కొన్నారు. ఈ చర్చలన్నీ అత్యంత సానుకూల వాతావరణంలో జరిగాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న తాను రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

 

#RevanthReddy #KishanReddy #Telangana #HyderabadMetro #MetroPhase2 #AshwiniVaishnaw #ManoharLalKhattar #DelhiMeetings #TelanganaDevelopment #CentralGovernment #RailwayProjects #MetroExpansion #PoliticalNews #InfrastructureDevelopment #TelanganaPolitics