Home Telangana తెలంగాణలో ఈవీ ఛార్జింగ్ దూకుడు 369 స్టేషన్లకు టీజీ రెడ్కో టెండర్లు

తెలంగాణలో ఈవీ ఛార్జింగ్ దూకుడు 369 స్టేషన్లకు టీజీ రెడ్కో టెండర్లు

తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి భారీ ఊతమిచ్చేలా 369 పబ్లిక్‌ ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో టెండర్లు జారీ చేసింది. హైదరాబాద్‌ పరిధిలో 200, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోని వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో 169 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని 200 స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేసి, ఎంపికైన ఛార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్లు 10 ఏళ్లపాటు నిర్వహణ, అప్‌గ్రేడేషన్‌, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టాలి. మరో 169 స్టేషన్లకు సర్వే, డిజైన్‌, సరఫరా, సివిల్‌ పనులు, ఇన్‌స్టాలేషన్‌, టెస్టింగ్‌, కమిషనింగ్‌తో పాటు 10 ఏళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. అర్హులైన బిడ్డర్లకు పీఎం ఈ-డ్రైవ్‌ నిబంధనల ప్రకారం సబ్సిడీ అందే అవకాశం ఉంది. రెండు ప్రాజెక్టుల్లో యూనిట్‌ ఛార్జింగ్‌ టారిఫ్‌ రూ.13 ప్లస్‌ జీఎస్టీగా నిర్ణయించారు. హైదరాబాద్‌ ప్రాజెక్టులో ఛార్జర్లకు కనీసం 95 శాతం అప్‌టైమ్‌ ఉండేలా నిబంధనలు రూపొందించారు.

ప్రైవేట్‌ రంగానికి భారీ అవకాశాలు

జాతీయ రహదారులు, ప్రధాన రవాణా మార్గాలతో తెలంగాణ ఈవీ రంగంలో పెట్టుబడులకు అనుకూల మార్కెట్‌గా మారుతోందని టీజీ రెడ్కో వీసీ, ఎండీ ముషారఫ్‌ ఫరూఖీ తెలిపారు. ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు నుంచి ఆపరేషన్‌, నిర్వహణ, బ్యాటరీ సేవలు, ఈవీ ఫ్లీట్‌ నిర్వహణ, డిజిటల్‌ ఛార్జింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ల వరకు విస్తృత వ్యాపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. పెరుగుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలకు అనుగుణంగా పబ్లిక్‌ ఛార్జింగ్‌ వ్యవస్థను విస్తరించడమే లక్ష్యమన్నారు. 169 స్టేషన్ల ప్రాజెక్టుకు సెప్టెంబర్‌ 7న ఉదయం 11.30 గంటలకు, 200 స్టేషన్ల ప్రాజెక్టుకు ఉదయం 11 గంటలకు ప్రీ-బిడ్‌ సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్‌ 8 నుంచి 22 వరకు బిడ్లను తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా సమర్పించవచ్చు. అందుబాటు ధరలో ఛార్జింగ్‌ సేవలతో పాటు ప్రైవేట్‌ ఆపరేటర్లకు దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలు కల్పించేలా ప్రాజెక్టులను రూపొందించారు.

 

#TelanganaEV #EVCharging #EVChargingStations #TGREDCO #TelanganaEVCharging #HyderabadEV #EVInfrastructure #ElectricVehicles #EVChargingNetwork #EVTenders #PublicEVCharging #Hyderabad #Warangal #Khammam #Karimnagar #Nizamabad #Adilabad #PMEDrive #EVBusiness #TelanganaGovernment #GreenMobility