Home AP గొంగట్లో కూటమి లెక్కలు త్యాగాల కథకు తెరపడిందా?

గొంగట్లో కూటమి లెక్కలు త్యాగాల కథకు తెరపడిందా?

స్థానిక పోరులో వాటాల వార్ షురూ!

అసెంబ్లీ ఎన్నికల వేళ ఒకరి కోసం మరొకరు అడుగులు వెనక్కి వేశారు.. అధికార పల్లకీని కలిసి మోశారు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. అధికారం చేతికొచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల రూపంలో కూటమి ముందు మరో పెద్ద పరీక్ష మొదలైంది. ఇక్కడ సిద్ధాంతాల కంటే సీట్ల లెక్కలు.. స్నేహం కంటే రాజకీయ భవిష్యత్తు.. త్యాగాల కంటే తమ వాటాపైనే టీడీపీ, జనసేన గురి పెట్టినట్టు కనిపిస్తోంది. “అప్పుడు మేం తగ్గాం.. ఇప్పుడు తగ్గం” అన్న జనసేన సంకేతాలు కూటమి లోపల కొత్త మంటలు రాజేస్తున్నాయి. మరోవైపు దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన టీడీపీ కేడర్‌కు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ముందుంది. ఈ లెక్కలో విజయవాడ ఎవరిది? కాకినాడ ఎవరి ఖాతాలోకి? తిరుపతిపై ఎవరి పట్టు? ఒంగోలు, ఏలూరులో ఎవరు వెనక్కి తగ్గుతారు? అన్న ప్రశ్నలు కూటమి గుండెల్లో చిచ్చు పెడుతున్నాయి. మూడో భాగస్వామి బీజేపీ వాటా అడిగితే లెక్క మరింత చిక్కుతుంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థులతో యుద్ధం మొదలయ్యేలోపే.. కూటమి గుడారంలో సీట్ల కోసం మోగుతున్న మోత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది.

 

#TDP #JanaSena #TDPJanaSena #APLocalElections #LocalBodyElections #AndhraPradeshPolitics #TDPPolitics #JanaSenaPolitics #SeatSharing #CoalitionPolitics #ChandrababuNaidu #PawanKalyan #BJP #TDPAlliance #JanaSenaAlliance #Vijayawada #Kakinada #Tirupati #Ongole #Eluru