Home National_news ఎన్నికల రగడ.. పోరు షురూ

ఎన్నికల రగడ.. పోరు షురూ

రాహుల్‌ ‘సత్యాగ్రహం’ వేదిక.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత.. రాహుల్‌ గాంధీ ‘సత్యాగ్రహం’ పేరుతో డిజిటల్‌ వేదికను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ సమస్యలపై పోరాడుతున్న ప్రజలు, విద్యార్థులు, రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు తమ ఉద్యమాలను నమోదు చేసుకునేలా ఈ వేదికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రారంభమైన తొమ్మిది గంటల్లోనే 10 వేలకు పైగా స్పందనలు వచ్చాయని రాహుల్‌ వెల్లడించారు. భూమి, మహిళల హక్కులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, విద్య, పరీక్షలకు సంబంధించిన సమస్యలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ప్రజల సమస్యలను పార్లమెంటులో, వీధుల్లో, లేఖల ద్వారా ప్రస్తావిస్తానని రాహుల్‌ పేర్కొన్నారు.

 

#RahulGandhi #Satyagraha #Congress #SatyagrahaPlatform #DigitalPlatform #PeoplesIssues #FarmersRights #StudentsIssues #TribalRights #DalitRights #WomensRights #LandRights #EducationIssues #IndianPolitics #CongressNews