Home National_news లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలి

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు రద్దు చేయాలి

దేశ వ్యాప్తంగా బ్యాలెట్‌తో ఎన్నికల జరపాలి.
మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే .

ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కలబుర్గిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల స్థానంలో బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎన్నికల చట్టబద్ధతపైనా ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. దేశం మొత్తం అక్రమ ఎన్నికలతో నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఓటర్ల జాబితాలపైనా రగడ

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. పేదలు, కార్మికులు, నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలు, మైనారిటీలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకే పోలింగ్‌ కేంద్ర పరిధిలో వందల పేర్లు తొలగిస్తే స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల వినియోగంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరారు.

అక్టోబర్‌ 6న ఢిల్లీలో పోరుబాట

ఈ అంశాలపై ప్రతిపక్ష కూటమి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 30న జరిగిన సమావేశంలో ఎన్నికల పారదర్శకత, ఓటర్ల జాబితాలు, ఎన్నికల సంఘం స్వతంత్రతపై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు జిల్లాల వారీగా ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 6న ప్రతిపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. నవంబర్‌ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభకు సైతం ప్రణాళిక రూపొందించారు.

 

#MallikarjunKharge #Kharge #Congress #FreshElections #LokSabhaElections #AssemblyElections #BallotPaper #EVM #SIR #VoterList #ElectionCommission #ElectoralReforms #INDIABloc #October6Protest #IndianPolitics