ఓటు సమరం.. వ్యవస్థపై యుద్ధమా?
సీఈసీపై పోరు.. సుప్రీంకోర్టు ముందుకు రాజకీయ తుఫాను
ఢిల్లీలో జంతర్‌మంతర్ నుంచి హైదరాబాద్ గాంధీభవన్ వరకు ఆందోళనల సెగ… సుప్రీంకోర్టు గడప దాటిన ఆరోపణలు.. ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకుంటున్న అనుమానాలు… సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై ప్రతిపక్షాల నేరుగా దాడి! అసలు ఏం జరుగుతోంది? ఫామ్ 6లో మార్పులు ఎవరు చేశారు? సర్‌లో ఓటర్ల పేర్లు ఎలా తొలగించారు? ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకపక్షంగా జరిగాయా? ఈ ప్రశ్నలతో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోర్టు మాత్రం ఆరోపణలను ఇప్పుడే నిజమని తేల్చలేదు.. రికార్డులు పరిశీలించి, ఎన్నికల సంఘం సమాధానం విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు కాంగ్రెస్ సీఈసీ రాజీనామా, సర్ రద్దు… బ్యాలెట్ పేపర్లపై ఎన్నికలు నిర్వహించాలంటూ మూడు డిమాండ్లతో పోరును ముమ్మరం చేసింది. జైరాం రమేశ్ “జీ-2” వ్యాఖ్యలతో దాడిని మరింత తీవ్రం చేశారు. ఎన్ఎస్యూఐ నుంచి ఇండియా కూటమి వరకు రోడ్డెక్కాయి. తెలంగాణలో ఫామ్-7లపై కొత్త ఆరోపణలు.. కేరళలో పాత కేసులపై న్యాయపరమైన కదలికలు.. అన్నీ ఒకేసారి తెరపైకి వచ్చాయి. ఇది కేవలం సీఈసీపై పోరా? లేక భారత ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి జరుగుతున్న అసలు పరీక్షా? అసలు లోపల ఏం జరుగుతోంది?
#GyaneshKumar #CEC #ElectionCommission #SupremeCourt #Form6 #SIR #VoterList #VoterRights #ElectionCommissionIndia #JairamRamesh #MallikarjunKharge #Congress #INDIABloc #BallotPaper #Elections #IndianPolitics











