50 శాతం స్థానాల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
మహిళా రిజర్వేషన్ల అమలుకు రాజ్యాంగ సవరణకు సిద్ధం!
రాష్ట్రాల మధ్య ప్రస్తుత లోక్‌సభ ప్రాతినిధ్య నిష్పత్తికి ఎలాంటి మార్పు లేకుండా 2051 వరకు కొనసాగించే ప్రతిపాదనను బిల్లులో పొందుపరిచినట్లు సమాచారం. తాజా జనాభా ఆధారంగా సీట్ల పంపిణీలో రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఈ విధానం తీసుకొచ్చినట్లు కేంద్రం భావిస్తోంది. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తోంది. అయితే కేబినెట్ ఆమోదం మాత్రమే సరిపోదు.. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు లోక్‌సభ, డిసెంబర్ 2, 3 తేదీల్లో రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు ప్రయత్నించనుంది. గతంలో ఈ బిల్లుకు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో ఆమోదం పొందలేదు. ఇప్పుడు కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ ముందుకు వెళ్తోంది. సీట్ల పెంపు ప్రతిపాదన పార్లమెంట్ ఆమోదం పొందితేనే అమల్లోకి వస్తుంది. అప్పటివరకు ఇది కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రతిపాదనగానే ఉంటుంది.
#LokSabhaSeats #DelimitationBill #UnionCabinet #WomensReservation #33PercentReservation #50PercentIncrease #ConstitutionalAmendment #ParliamentSession #LokSabha #RajyaSabha #IndianPolitics #November30











