Home AP గ్రామీణ ఎన్నికల్లోనూ కూటమికి ఆదరణ

గ్రామీణ ఎన్నికల్లోనూ కూటమికి ఆదరణ

వైసీపీకి 26 శాతమే మద్దతు: పల్లా

ఆంధ్రప్రదేశ్ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు పలికారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ మద్దతుదారులు 26 శాతానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజల తీర్పు కూటమికే అనుకూలంగా ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో పాటు నారా లోకేష్ ఆలోచనా విధానంపై ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు మద్దతు తెలిపారని వివరించారు.

రాజేంద్రన్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం

కుప్పం మండలం వానగుట్టపల్లిలో మృతి చెందిన రాజేంద్రన్ టీడీపీ కార్యకర్తేనని, పార్టీ సభ్యత్వం కూడా ఉందని పల్లా స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ బీమా ద్వారా రూ.5 లక్షలు అందిస్తామని, కుటుంబానికి ఇతర సహాయాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై వైసీపీ, సాక్షి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలు జరిగాయని విమర్శిస్తూ, ప్రస్తుత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి ఆధిపత్యం ఏర్పడితే అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే విడతల్లోనూ కూటమి విజయాలు కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

 

#APPanchayatElections #PallaSrinivasaRao #TDP #NDAAlliance #YSRCP #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #AndhraPradeshPolitics #Kuppam #LocalBodyElections #PanchayatPolls