Home National_news పీఎం ఈ-డ్రైవ్‌తో విద్యుత్ వాహ‌నాల జోరు

పీఎం ఈ-డ్రైవ్‌తో విద్యుత్ వాహ‌నాల జోరు

ప‌ర్యావ‌ర‌ణ‌హిత ప‌థ‌కానికి భారీగా ఆద‌ర‌ణ‌.
విద్యుత్ వాహ‌నాల కోనుగోలుకు స‌బ్సిడీలు.

దేశంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు కేంద్రం పీఎం ఈ-డ్రైవ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. 2024 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకాన్ని 2028 మార్చి 31 వరకు పొడిగించారు. మొత్తం రూ.11,900 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంచడం, కర్బన ఉద్గారాలను నియంత్రించడం ప్రధాన లక్ష్యాలు. సుమారు 28.30 లక్షల విద్యుత్‌ వాహనాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

కొనుగోలుదారులకు భారీ ప్రోత్సాహం

ఈ పథకం కింద విద్యుత్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కుల కొనుగోలుకు సబ్సిడీలు లభిస్తున్నాయి. రూ.1.5 లక్షల లోపు ఫ్యాక్టరీ ధర ఉన్న ఈ-ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌ గంటకు రూ.2,500 చొప్పున, గరిష్ఠంగా రూ.5,000 రాయితీ అందుతోంది. ఈ-వౌచర్‌ రూపంలో కొనుగోలు సమయంలోనే ప్రయోజనం కల్పిస్తున్నారు. దీంతో 2026 జూన్‌ నాటికి దేశంలో 26.59 లక్షల విద్యుత్‌ వాహనాలు విక్రయమయ్యాయి.

ఈ-బస్సులు, ఛార్జింగ్‌ వసతులకు ప్రాధాన్యం

ప్రజా రవాణా విద్యుదీకరణకు రూ.4,391 కోట్లతో 14,028 ఈ-బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ సహా ఏడు ప్రధాన నగరాలకు 13,800 బస్సులు మంజూరయ్యాయి. ఛార్జింగ్‌ మౌలిక వసతుల కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు. పది రాష్ట్రాల్లో 8,147 ఛార్జర్ల ఏర్పాటుకు రూ.851 కోట్లు ఆమోదించారు. స్వదేశీ విడిభాగాల తయారీకి ప్రోత్సాహంతో పాటు వాహన పరీక్షా సంస్థల ఆధునీకరణకు రూ.780 కోట్లు కేటాయించడం ద్వారా విద్యుత్‌ వాహన రంగానికి మరింత ఊపునిస్తున్నారు.

#PMEDRIVE #ElectricVehicles #EVSubsidy #EVIndia #ElectricMobility #EVSales #GreenMobility #ElectricTwoWheelers #ElectricThreeWheelers #ElectricBuses #EVCharging #ChargingInfrastructure #SustainableTransport #CleanEnergy #IndiaEV