Home General లండన్‌ కల మాటున భారీ చీటింగ్‌ కుట్ర

లండన్‌ కల మాటున భారీ చీటింగ్‌ కుట్ర

యూకే ఉద్యోగాల పేరుతో మోసాల వల.
జాబ్స్‌ పేరుతో చీటింగ్‌ నెట్‌వర్క్.
యూట్యూబర్‌ చుట్టూ కోట్ల చీటింగ్‌ దందా .

లండన్‌ వెళ్లాలన్న కల.. చేతిలో లక్షలు.. నమ్మకంగా చెప్పిన మాటలు.. చివరకు విమానాశ్రయంలో పోలీసుల అదుపు! ‘నందూస్‌ వరల్డ్‌’తో సోషల్‌ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు యూట్యూబర్‌ అన్నె రామ నందన చుట్టూ రూ.15 కోట్ల మోసం ఆరోపణలు సంచలనంగా మారాయి. యూకేలో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్‌షిప్‌లు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడం కేసును కీలక మలుపు తిప్పింది. లుక్‌అవుట్‌ సర్క్యులర్‌తో హైదరాబాద్‌ విమానాశ్రయంలో నందనను పోలీసులు అదుపులోకి తీసుకోవడం మరింత ఉత్కంఠ రేపింది. నకిలీ CoS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ పత్రమా? లండన్‌ ఉద్యోగాల పేరుతో భారీ వసూళ్లా? సుమారు 20 మంది బాధితులున్నారా? ఒక్కో ప్రశ్న ఇప్పుడు కేసును మరింత లోతుగా తీసుకెళ్తోంది. ఓ బాధితుడు చెల్లించిన రూ.15 లక్షల్లో రూ.2 లక్షలు మాత్రమే తిరిగి వచ్చాయని ఆరోపించడంతో ఇబ్రహీంపట్నం పోలీసుల దర్యాప్తు మొదలైంది. మరోవైపు తనకు ఎలాంటి కన్సల్టెన్సీతో సంబంధం లేదని నందన ఖండిస్తున్నారు. కలల నగరం లండన్‌.. కథ మాత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది!

 

#RamNandana #Nandana #NandusWorld #TeluguYouTuber #UKJobScam #LondonJobScam #UKJobsFraud #VisaScam #VisaSponsorship #CoS #CertificateOfSponsorship #CheatingCase #FraudCase #IbrahimpatnamPolice #HyderabadAirport #LookoutCircular #15CroreScam #UKJobs #NandanaControversy #CrimeNews #TeluguNews