శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో రోజు ఆటను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా.. ఆ తర్వాత శ్రీలంకను కష్టాల్లోకి నెట్టింది. భారత బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో వికెట్ తీసుకోవడంతో ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8/2తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు ధ్రువ్ జురేల్ అద్భుత శతకంతో భారత స్కోరును భారీ స్థాయికి తీసుకెళ్లాడు. జురేల్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. 99 పరుగుల వద్ద రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు చివరకు 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడికి ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు పరుగులతో సహకరించాడు. భారత్ భారీ స్కోరుతో డిక్లేర్ చేసిన తర్వాత శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. అయితే వెలుతురు సరిగా లేదని శ్రీలంక ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలోనే రెండు వికెట్లు కోల్పోయారు. దీంతో రెండో రోజు ముగిసేసరికి భారత్ మ్యాచ్‌పై స్పష్టమైన పట్టు సాధించింది.
#IndiaVsSriLanka #INDvsSL #2ndTest #ColomboTest #TeamIndia #IndianCricket #SriLankaCricket #DhruvJurel #DhruvJurelCentury #PrasidhKrishna #ManavSuthar #TestCricket #IndiaCricket #SriLankaTestSeries #CricketNews #INDvsSLTest #TeamIndiaNews











